హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) బాలీవుడ్‌పైనే విరక్తి చెందుతున్నాడు. జనాలు ఆలోచన చూసి పిచ్చెక్కుతోందని, ముంబైని వదిలేసి సౌత్ ఇండస్ట్రీలో సెటిలైపోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను దక్షిణాది చిత్రపరిశ్రమ(South Industry)ని చూసి అసూయ చెందుతున్నాను. ఎందుకంటే వారిలాగా నేను ఇక్కడ (బాలీవుడ్‌లో) ప్రయోగాలు చేయడం కష్టం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది.
మొదటినుంచి లెక్కలు
చేయాలన్న కసి నాలో ఉన్నా లాభనష్టాల బేరీజు వేసుకుని నిర్మాతలు వెనకడుగు వేస్తారు. నాకు లాభమే రాలేదు, నీవల్ల డబ్బు నష్టపోయా అని తిడుతుంటారు. సినిమా ప్రారంభం నుంచీ వ్యాపారం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అమ్ముదాం, మనకెంతొస్తుంది? ఇదే చర్చ.. దీనివల్ల సినిమా తీసేటప్పుడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను. అందుకే ఈ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది ముంబైని వదిలేస్తాను.
మెదళ్లు మొద్దుబారిపోయాయి
సౌత్ ఇండస్ట్రీకి మకాం మార్చేస్తాను. దక్షిణాదిలో ఎప్పటికప్పుడు కొత్తవి చేయాలన్న కోరిక వారిలో రగులుతూనే ఉంటుంది. నేను ఇక్కడికి రాకుండా బాలీవుడ్(Bollywood)లోనే ఉండిపోతే ఒక ముసలాడిగా అక్కడే చనిపోతాను. అక్కడి వారి ఆలోచనావిధానం నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది, అసహ్యమేస్తోంది. పోనీ కలెక్షన్స్ గుమ్మరించే పుష్ప వంటి సినిమాలను కూడా బాలీవుడ్ తీయలేకపోతోంది. ఎందుకంటే అక్కడవారికి మెదడే లేదు. సౌత్‌లో దర్శకుడిపై మొదట ఆధారపడతారు. వారిని పూర్తిగా నమ్ముతారు.
బాలీవుడ్‌లో ఇగో ఎక్కువ
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అలా ఎంతోమందిని నమ్మి కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేశారు. ఇలాంటివారిని బాలీవుడ్ నమ్మదు. వారి మాటల్ని అస్సలు లెక్క చేయలేదు. ఎందుకంటే ఇగో అని చెప్పుకొచ్చాడు. కాగా అనురాగ్ చివరగా రైఫిల్ క్లబ్, విడుదలై 2 సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు దాదాపు 18 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో మొట్ట మొదటి చిత్రం పాంచ్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. రెండు దశాబ్దాల తర్వాత పాంచ్‌ను ఎట్టకేలకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది పాంచ్ ప్రేక్షకుల ముందుకురావచ్చు!
చదవండి: కోమాలో కుమారుడు.. కోలుకోగానే ఆ హీరో పేరే తలిచాడు: నాజర్
Comments
Please login to add a commentAdd a comment