
పెద్ద యాక్సిడెంట్ జరిగి కోమా నుంచి బయటకు రాగా ఎవరైనా అమ్మ, నాన్న అంటారు. కానీ తన కుమారుడు మాత్రం ఓ స్టార్ హీరో పేరు తలిచాడంటున్నాడు నాజర్ (Nassar). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ రోడ్డు ప్రమాదానికి గురై 14 రోజులు కోమాలోనే ఉన్నాడు. మెరుగైన చికిత్స కోసం సింపూర్‌కు తీసుకెళ్లాం. అతడు కోమాలో నుంచి బయటకు రాగానే అమ్మ అనో నాన్న అనో పిలవలేదు.
హీరో పేరు కలవరించాడు
విజయ్ (Vijay) పేరు తలిచాడు. యాక్సిడెంట్ అయినప్పుడు నా కుమారుడితో పాటు అతడి స్నేహితుడు విజయ్ కుమార్ కూడా ఉన్నాడు. బహుశా అతడిని తలుచుకుంటున్నాడేమో, హమ్మయ్య అన్నీ గుర్తొస్తున్నాయిలేనని కాస్త ఊరట చెందాం. కానీ అది నిజం కాదని త్వరగానే తెలిసిపోయింది. విజయ్ కుమార్‌ను తీసుకొచ్చినప్పుడు అతడిని గుర్తుపట్టలేకపోయాడు. ఇతడెవరన్నట్లు చూశాడు. నా భార్య ఒక సైకాలజిస్ట్.

ఆయన సినిమాలే చూపించాం
తనకు విషయం అర్థమైంది. వాడు తన స్నేహితుడిని కాకుండా హీరో విజయ్‌ను కలవరిస్తున్నాడని తెలిసింది. అందుకని అతడు కోలుకునేవరకు విజయ్ పాటలు, సినిమాలు చూపించాం. ఈ విషయం తెలిసి హీరో విజయ్ కూడా ఆస్పత్రికి వచ్చి పలుమార్లు ఫైజల్‌ను చూశాడు. వాడికి సంగీతం అంటే ఇష్టమని ఓ గిటార్ కూడా బహుమతిగా ఇచ్చాడు. మా మనసుల్లో అతడికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని నాజర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు