బాహుబలి-2, ప్రభాస్‌పై చెలరేగిపోయిన కేఆర్‌కే
ముంబై: సెన్సేషనల్ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సినిమా బాహుబలి-2(ద కంక్లూజన్)పై బాలీవుడ్ ఫిల్మి క్రిటిక్ ,పబ్లిసిటీ కింగ్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద మూవీ రివ్యూలతో పాపులర్ అయిన కమల్ తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి-2ని టార్గెట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ -2 సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో విమర్శల బుల్లెట్ల వర్షం కురిపించాడు. అంతేకాదు హీరో ప్రభాస్‌పైకూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒంటెలా కనిపించే ప్రభాస్‌ను హిందీ నిర్మాతలు ఎవరైనా తీసుకుంటే, వారు కచ్చితంగా ఇడియట్స్ అంటూ చెలరేగిపోయి ట్వీట్ చేశాడు.
బాహుబలి2 లో కథే లేదు. రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి అసలు మాట్లాడక్కర్లేదు. ఎంటర్ టైన్‌మెంట్ లేదు. ఎమోషన్ లేదు. విఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ ఘోరం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్ చేస్తుంది. రియాల్టీకి దగ్గరగా లేదు. వాస్తవానికి వేలమైళ్ల దూరంలోఉంది. సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్పలు నచ్చదు. ఇది కమల్ ఆర్ ఖాన్ రివ్యూ.
అంతేకాదు ఈ సినిమా చూడడం శుద్ధ దండుగ అని తేల్చేశాడు. డబ్బులు, సమయం వృధా చేసుకోవద్దంటూ ప్రేక్షకులకు ఓ సలహా ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే పదిశాతం కూడా బాగా లేదన్నాడు. ఇక ఎడిటర్‌పై అయితే తీవ్ర విమర్శలు గుప్పించాడు. మూడు గంటలు తీయాల్సిన మెటీరియలేదు.. వేస్ట్ అంటూ ప్రస్తావించాడు. అంతేకాదు ఈ సినిమా పిల్లలు కంప్యూటర్ వీడియో గేమ్‌లా చూడ్డానికి బావుంటుందంటూ పేర్కొన్నాడు.
అయితే రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, ప్రభాస్ బాగా నటించారని చెప్పాడు. ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు. బిజినెస్ రేటింగ్ మాత్రం 8 ఎనిమిది ఇచ్చాడు. ఈ సినిమాకు ఇచ్చిన హైప్ కారణంగా 2నుంచి 3 వందల కోట్లు వసూలు చేస్తుందని వ్యాఖ్యానించాడు.
కమల్ వీడియోపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపని, ఇలాంటి వ్యాఖ‍్యలు చేయడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటేనంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుని తిరిగి వార్తల్లోకి రావడమే ఆయన లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
If some Hindi producers are taking Prabhas who looks like 🐫in their films then definitely they are idiots. #Baahubali is working not Prabhas
— KRK (@kamaalrkhan) April 29, 2017