ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం | Actor Ashish Vidyarthi rescued on set | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Tue, Oct 21 2014 2:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం

రాయ్పూర్: ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. బిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుపుకోంటుంది. అందులోభాగంగా ఆశీష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నుంచున్నారు.  ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా...  అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు.ఆశీష్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

వెంటనే తేరుకున్న అశీష్ మాట్లాడుతూ... ఈ ఘటనతో కొంత భయాందోళనకు గురయైనట్లు ఆశీష్ చెప్పారు.  ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని ఆయన సహాచర నటీనటులకు సూచించారు. ఈ ప్రమాదం తనకు ఓ పాఠమని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement