నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, సహానటుడిగా నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇటీవల యూట్యూబర్‌గా, పబ్లిక్ స్పీకర్‌గా ప్రజలకు మరింత చేరువయ్యాడు. అంతేగాదు ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ద రుచికరమైన వంటకాల గురించి అన్వేషించడం, వాటిని తన అభిమానులకు తెలియజేయడం వంటివి చేస్తాడు. చెప్పాలంటే చాలామందికి తెలియని కొంగొత్త తినుబండారాల గురించి పరిచయం చేస్తాడు. అంతేగాదు ఒక ఇంటర్యూలో వివిధ ప్రాంతాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేస్‌లు గురించి షేర్ చేసుకున్నారు కూడా. అవేంటంటే..
ఫుడ్ వ్లాగింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో భారతదేశంలో ట్రై చేయగల బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు గురించి చెప్పుకొచ్చారు. కోల్‌కతా ఆహారం అద్భుతమైనదని, అక్కడ కచోరిలతో రోజుని ప్రారంభించమని చెప్పాడు. అందుకోసం మహారాజా(చంగని పప్పి మహారాజ్, బారా బజార్, నింబుతల్లాలో ఉంది), శర్మ టీ స్టాల్ (భవానీపూర్‌లో).రెండు కూడా ప్రసిద్ధ తినుబండారాలే. అలాగే ఆల్ టైం ఫేవరెట్ తినుబండారం అయిన బిర్యానీ కోసం అర్సలాన్ రెస్టారెంట్, హంగ్లాథెరియం (లేక్ గార్డెన్స్‌లో) రెండింటిని ప్రయ్నత్నించొచ్చని చెప్పాడు.
బెంగళూరులో 1943లో స్థాపించిన శాఖాహర రెస్టారెంట్‌లో తినొచ్చని అన్నారు. అక్కడ ప్రసిద్ద కన్నడ ఫుడ్ మంచి రుచిగా అందిస్తారని అన్నారు. నిజానికి దీన్ని సమీపంలోని పాఠశాలల్లోని విద్యార్థుల కోసం శ్రీ వెంకటరమణ ఉరల్‌చే చిన్న క్యాంటీన్‌గా ప్రారంభించారు. ఆ తర్వత బెంగళూరుని సందర్శించే వాళ్లకు బెస్ట్ ఫుడ్ ప్లేస్‌గా పేరుగాంచింది.
అలాగే కేరళలోని పాలక్కాడలో తనకు నచ్చిన బిర్యానీ స్పాట్ గురించి చెప్పారు. హసిన్ కిచెన్‌లో చేసే తలస్సేరి దమ్ బిరియానీ, రుచికరమైన చేపల కూర, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక హిమచల్‌ప్రదేశానికి వస్తే.. బరోగ్‌లోని చాచు డా ధాబాలో పరాథే ప్రయత్నించమని, అలాగే చండీగఢ్‌లోని పష్తున్ రెస్టారెంట్ రాన్ ప్లేట్‌ను ఆస్వాదించమని సూచించారు.
(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment