ప్రపంచవ్యాప్తంగా బాగా వినియోగించే ఆహారాల్లో కొబ్బరికాయలు ప్రధానమైనవి. అన్ని చోట్లా ఆయా పద్దతుల రీత్యా వీటిని బాగా వినియోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు చేసే మేలును గుర్తించడం కోసం ఒక రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ప్రతి ఏటా ఆ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఆసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొబ్బరితో చేసే ప్రసిద్ధ రెసిపీలు, లాభాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
మనదేశంలో ఏ చిన్న పూజ లేదా ఏ కార్యమైనా కొబ్బరికాయ లేనిదే పూర్తి కాదు. ముఖ్యంగా కేరళ కొబ్బరికాయ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ కొబ్బరికాయ రుచి పరంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీన్ని కూరగా లేదా పచ్చడి రూపంలో తీసుకుంటారు చాలామంది. దీన్ని పలురకాల రెసిపీలో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. ఎంతటి రుచిలేని కూరకైనా కాస్త కొబ్బరిని జోడిస్తే దాని రుచే వేరు. అలాంటి కొబ్బరితో వివిధ రాష్ట్రాల్లో చేసే ప్రముఖ వంటకాలేంటో చూద్దాం..
ఎరిస్సేరీ:
ఎరిస్సేరీ అనేది కేరళకు చెందిన సాంప్రదాయక వంటకం. ఇది ఓనం వంటి పండుగ సందర్భాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కూర గుమ్మడికాయ, పప్పు, కొబ్బరితో తయారు చేస్తారు. చివరిగా ఆవాలు, కరివేపాకు మరియు ఎండు మిరపకాయలతో తాలింపు వేస్తారు. ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్.
చింగ్రీ మలై కర్రీ
చింగ్రి మలై కర్రీ అనేది ఒక ప్రసిద్ధ బెంగాలీ వంటకం. దీన్ని పెద్ద సైజులో ఉండే రొయ్యలతో చేసే కూరలో ఉపయోగిస్తారు. మసాల దినులు, కొబ్బరిపాలతో ఈ రొయ్యల కూర చేస్తారు.
బాంగ్ద్యాచే అంబట్ కాల్వన్
ఇది మహారాష్ట్రలోని తీర ప్రాంతాలలో చేసే స్పైసీ చేపల కూర. మాకేరెల్ (బాంగ్డా) కొబ్బరిపాలతో తయారు చేసిన కూర తింటే..ఓ పక్క నోరు మండుతున్న తింట ఆపరట. అంతలా స్పైసీగా టేస్టీగా ఉంటుందట. ఈ రెసిపీలో చింతపండు పులుసు అత్యంత కీలమైనది. ఇది గ్రేవీకి మంచి టేస్ట్ అందిస్తుంది.
ఖవ్సా
ఖవ్సా లేదా ఖౌ సూయ్ గుజరాత్‌లోని కుచ్చి మెమన్ కమ్యూనిటీ తయారు చేసే వంటకం. చికెన్‌ని, కొబ్బరి పాలతో చేసే వంటకం. ఇది సాధారణంగా పూర్తి భోజనం కోసం క్రిస్పీ ఫ్రైడ్ నూడుల్స్ లేదా సెవ్‌తో వడ్డిస్తారు.
గోవాన్ జిట్ కోడి
జిట్ కోడి ప్రతి గోవా ఇంటిలో ప్రధానమైనది. ఇది కూడా చేపలతో తయారు చేసే వంటకమే. సాధారణంగా మాకేరెల్ లేదా కింగ్ ఫిష్, వంటి వాటిని కొబ్బరి పాలు, ఎర్ర మిరపకాయలు, కొత్తిమీరచ చింతపండు మిశ్రమంతో తయారు చేస్తారు.
వెజిటబుల్ కుర్మా
వెజిటబుల్ కుర్మా అనేది దక్షిణ భారతదేశం అంతటా ఒక ప్రసిద్ధ వంటకం. ఇది తేలికపాటి మసాలాలతో కూడిన కొబ్బరి గ్రేవీకి పేరుగాంచింది. కుర్మాలో సాధారణంగా క్యారెట్, బఠానీలు, బీన్స్చ బంగాళదుంపలు వంటి వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. వీటిని కొబ్బరి, జీడిపప్పు, పెరుగుతో తయారు చేసిన సాస్‌తో వండుతారు. ఈ వంటకానికి లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వంటివి మొత్తం కూర రుచిని పెంచుతాయి. దీన్ని చపాతీలు లేదా పరాఠాలతో ఆస్వాదించవచ్చు.
నార్కెల్ దూద్ పులావ్
కొబ్బరి పాలతో కూడిన మరో బెంగాలీ వంటకం. ఇక్కడ పులావ్‌ని కొబ్బరి పాలతో తయారు చేస్తారు. ఇది సాధారణంగా గోబిందోభోగ్‌లా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి పాలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, దాల్చిన చెక్క, ఏలుకులు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారుచేస్తారు.
చికెన్ కాల్డిన్
చికెన్ కాల్డైన్ ఒక తేలికపాటి మరియు సుగంధ గోవా కూర. ఈ వంటకం కోకోనట్ మిల్క్ గ్రేవీలో ఉడికించి, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీరతో రుచికరంగా తయారు చేస్తారు. దీన్ని అన్నం లేదా ఇష్టమైన రోటీలతో ఆస్వాదించవచ్చు.
కొబ్బరితో కలిగే లాభాలు..
పోషకాలతో నిండిన కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెను చర్మం, జుట్టుకు అప్లై చేస్తే తేమను సమర్థవంతంగా లాక్ చేస్తుంది. పొడి చర్మం, పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది. తామర వంటి చర్మవ్యాధులను నిర్వహించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకుంటే కేలరీల వినియోగాన్ని పెంచడానికి పెరుగు లేదా ఓట్ మీల్‌లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు జోడించండి. ఇది ఆకలిని తీర్చడానికి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది.
(చదవండి: ఉడకని పంది మాంసం తింటే ఇంత డేంజరా..!)
Comments
Please login to add a commentAdd a comment