ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కాస్త జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ఒక్క విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నాను. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారు దయచేసి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు ఆశిష్. ‘చిరుత, అతిథి, అదుర్స్, పంతం, ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాల్లో నటించిన ఆశిష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. కేవలం తెలుగులోనే కాదు...తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడ ఆశిష్ సినిమాలు చేశారు.
చదవండి: ఆ హీరో దుస్తులకు దూరం
Comments
Please login to add a commentAdd a comment