‘‘తోటి నటీనటులతో పాటు యాక్ట్ చేస్తూ, నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాననే విషయంపై మాత్రమే నేను దృష్టి పెడతాను. అంతేకానీ ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు చూడను’’ అన్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. సుహాస్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
ఈ చిత్రంలో కీ రోల్ చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ– ‘‘మంచి హ్యూమర్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకు ఏదో సాధిస్తాడని ఆశపడే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించాను. కానీ ఈ తండ్రి జీవితంలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు, రోహిణీగారికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చేసే ప్రతి పాత్రను నేను డ్రీమ్ రోల్‌గానే భావిస్తాను. మొదట్లో విలన్ రోల్స్ చేశాను. అయితే నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. అయితే మనకు ఎటువంటి పాత్రలు ఇవ్వాలనేది దర్శక–రచయితలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు మేం న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించే బాధ్యత మా ఆర్టిస్టులదే’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment