విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా బాహుభాషా నటుడిగా పేరున్న ఆశీష్ విద్యార్థి రీసెంట్‌గా రైటర్ పద్మభూషణ్‌లో నటించాడు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రావెల్ చేస్తూ రకరకాల వంటకాలను రుచిచూసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
తాజాగా ఆయన తిరుపతిలో సందడి చేశారు. రోడ్ సైడ్ హోటల్లో టిఫిన్ చేసారు. వేడివేడి దోశతో పాటు కరకరలాడే ఉద్ది వడ తిన్నానంటూ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సదరు హోటల్ ఫుడ్‌పై ప్రశంసలు కురిపించారు.
ఇలాంటి దోసెలు ఈశాన్య రాష్ట్రాల్లో దొరకవంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆశీష్ విద్యార్థి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫేమస్ నటుడు అయినప్పటికీ ఇలా స్ట్రీట్‌ఫుడ్ ఎంజాయ్ చేయడం బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment