
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చీరకట్టు,మెడలో మంగళసూత్రంతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్ కోసం ఇలా తయారయ్యిందేమో అంటూ మరికొందరు భావిస్తున్నారు.
గతంలోనూ ఆమె సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడంతో ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె పెళ్లి టాపిక్ తెరమీదకు వచ్చింది.
చదవండి: తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Comments
Please login to add a commentAdd a comment