ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు.
ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్బంగా కూతురితో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తను తలుచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది.
'నా కళ్లలో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న భాదే ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ నాతోనే ఉంటాయి అని నాకు తెలుసు. నా ప్రతి బర్త్‌డేకి నువ్వు చేసే హడావిడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ ఫర్ ఎవర్' అంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా 2019లో అనారోగ్యంతో సురేఖ వాణి భర్త చనిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment