
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
త్వరలో సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా అందుకు సుప్రీత అవుననే సమాధానం ఇచ్చింది. మా అమ్మకు పెళ్లిచేస్తానంటూ బదులిచ్చింది. ఇక రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? మీరిద్దరు సింగిలా అని అడగ్గా ప్రస్తుతానికి అవునని, కానీ మాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ సురేఖవాణి పేర్కొంది. అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా రివీల్ చేసింది.
అయితే నువ్వు చెప్పే క్వాలిటీస్ ఆయనలో లేవెంటీ మమ్మీ అంటూ సుప్రీత కొంటెగా ప్రశ్నించగా ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖవాణి ఆమె నోరు కట్టేసింది. దీంతో సురేఖవాణి త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
Comments
Please login to add a commentAdd a comment