
కర్ణాటక ,మైసూరు: రెండో పెళ్ళి చేసుకున్న మహిళ మొదటి భర్తను మరిచిపోలేక ఆవేదనకు లోనై ప్రాణాలు తీసుకుంది. బుధవారం మైసూరు నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హీనా కౌసర్ (27) ఆత్మహత్య చేసుకున్న మహిళ. మైసూరు ఉదయగిరి ప్రాంతంలోని గౌసియా నగరలో ఆమె నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివాదాల వల్ల మొదటి భర్త నుంచి విడిగా ఉంటున్న మహిళ కొన్ని నెలల క్రితం మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అయినప్పటికీ ఆమె ప్రతి రోజు మొదటి భర్తను గుర్తుకు చేసుకుంటూ బాధపడేది. బుధవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment