భార్యతో రెండోపెళ్లి.. ఆమె చెల్లెలి మెడలో కూడా..!! | Madhya Pradesh Man Married Wife And Her Sister At Same Ceremony | Sakshi
Sakshi News home page

భార్యతో రెండోపెళ్లి.. ఆమె చెల్లెలి మెడలో కూడా..!!

Dec 11 2019 1:06 PM | Updated on Dec 11 2019 1:21 PM

Madhya Pradesh Man Married Wife And Her Sister At Same Ceremony - Sakshi

భార్యను మరోసారి పెళ్లి చేసుకోవడమే విశేషం అనుకుంటే.. అదే ముహూర్తానికి ఆమె చెల్లెలి మెడలో కూడా దీపు పరిహార్‌ (35) అనే వ్యక్తి మూడు ముళ్లు వేశాడు

భోపాల్‌ : భార్యను రెండోసారి వివాహం చేసుకున్న వ్యక్తికి సంబంధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. భార్యను మరోసారి పెళ్లి చేసుకోవడమే విశేషం అనుకుంటే.. అదే ముహూర్తానికి ఆమె చెల్లెలి మెడలో కూడా దీపు పరిహార్‌ (35) అనే వ్యక్తి మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన నవంబర్‌ 26 న గుడావళి అనే గ్రామంలో జరగగా సోషల్‌ మీడియాలోవైరల్‌ అయింది. వినితా (28)తో దీపు పరిహార్‌కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. 

అయితే, గత కొంతకాలంగా వినితా ఆరోగ్యం సరిగా ఉండటం లేదని పరిహార్‌ తెలిపాడు. ఆమె కోరిక మేరకు.. తమ ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు రెండో పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. ఒకే ముహుర్తానికి మరోసారి వినితాతోపాటు ఆమె చెల్లెలు రచనా (22) మెడలో తాళి కట్టానని చెప్పాడు. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరం అనే విషయం తెలిసిందే.  ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని భింద్‌ ఎస్పీ రుడాల్ఫ్‌ అల్వారిస్‌ తెలిపారు. వినితా గుడావళి సర్పంచ్‌ కావడం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement