bigamy
-
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్‌కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
భార్యతో రెండోపెళ్లి.. ఆమె చెల్లెలి మెడలో కూడా..!!
భోపాల్ : భార్యను రెండోసారి వివాహం చేసుకున్న వ్యక్తికి సంబంధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. భార్యను మరోసారి పెళ్లి చేసుకోవడమే విశేషం అనుకుంటే.. అదే ముహూర్తానికి ఆమె చెల్లెలి మెడలో కూడా దీపు పరిహార్ (35) అనే వ్యక్తి మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన నవంబర్ 26 న గుడావళి అనే గ్రామంలో జరగగా సోషల్ మీడియాలోవైరల్ అయింది. వినితా (28)తో దీపు పరిహార్‌కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే, గత కొంతకాలంగా వినితా ఆరోగ్యం సరిగా ఉండటం లేదని పరిహార్ తెలిపాడు. ఆమె కోరిక మేరకు.. తమ ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు రెండో పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. ఒకే ముహుర్తానికి మరోసారి వినితాతోపాటు ఆమె చెల్లెలు రచనా (22) మెడలో తాళి కట్టానని చెప్పాడు. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరం అనే విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని భింద్ ఎస్పీ రుడాల్ఫ్ అల్వారిస్ తెలిపారు. వినితా గుడావళి సర్పంచ్ కావడం మరో విశేషం. -
పోలీసు అధికారికి 15 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: అత్యాచారం, మోసం కేసులో ఢిల్లీ పోలీసు అధికారి ఒకరికి అడిషనల్ సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించింది. మొదటి పెళ్లిని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్న నేరానికి అతడికీ శిక్ష పడింది. నిందితుడు రవి రాథీతో బాధితురాలికి పోలీసు ట్రైనింగ్ కాలేజీలో 2009లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ 2013, అక్టోబర్ లో రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. అయితే అప్పటికే అతడికి పెళ్లైన విషయం తర్వాత బయటపడింది. అదే ఏడాది మే నెలలో మరో మహిళను అతడు పెళ్లాడినట్టు తెలియడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. మరొకరు ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ శిక్ష విధించినట్టు న్యాయమూర్తి వీరంద్ర భట్ పేర్కొన్నారు. ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేయడమే కాకుండా వారిని మోసం చేశాడని అన్నారు. ఇద్దరు మహిళల ఎమోషన్స్, సెంటిమెంట్స్ తో ఆడుకున్నాడని తెలిపారు. పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేశాడని, అతడిని గుణపాఠం నేర్పే శిక్ష విధించడం కరెక్టేనని అభిప్రాయపడ్డారు. -
దొంగమొగుడి గుట్టు రట్టుచేసిన ఫేస్బుక్
ఆమె ఓ టీచర్. మాట్రిమోనీ వెబ్సైట్ చూసి, ఒక వ్యక్తిని చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకుంది. ఏడాది నుంచి భర్తతో ఎంచక్కా కాపురం చేస్తోంది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఎందుకో ఫేస్బుక్ చూసింది. అందులో తన భర్త పేజీని కూడా ఓపెన్ చేసింది. అంతే.. ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే, అప్పటికే ఆమె భర్తకు ఒకసారా పెళ్లయిపోవడమే కాదు.. ఓ కూతురు కూడా ఉంది. ఆ విషయం ఫేస్‌బుక్‌లోనే బయటపడింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్‌లో ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సదరు దొంగమొగుడు.. ఆమెను మాట్రిమోనీ సైట్లో చూసి నచ్చిందంటూ రిక్వెస్టు పెట్టాడు. తర్వాత రెండు నెలల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకుని, రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత పుణె వెళ్లిపోయారు. 2014లో గుర్గావ్కు మారారు. కొన్నాళ్ల తర్వాత ఫేస్బుక్లో మొగుడుగారి పేజీ చూసేసరికి అతడు దొంగమొగుడని తేలింది. అతడి స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పదంగా పోస్టింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. దాంతో వెంటనే తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేసింది. వెంటనే దొంగమొగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.