దొంగమొగుడి గుట్టు రట్టుచేసిన ఫేస్బుక్
ఆమె ఓ టీచర్. మాట్రిమోనీ వెబ్సైట్ చూసి, ఒక వ్యక్తిని చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకుంది. ఏడాది నుంచి భర్తతో ఎంచక్కా కాపురం చేస్తోంది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఎందుకో ఫేస్బుక్ చూసింది. అందులో తన భర్త పేజీని కూడా ఓపెన్ చేసింది. అంతే.. ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే, అప్పటికే ఆమె భర్తకు ఒకసారా పెళ్లయిపోవడమే కాదు.. ఓ కూతురు కూడా ఉంది. ఆ విషయం ఫేస్బుక్లోనే బయటపడింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్లో ఓ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్న సదరు దొంగమొగుడు.. ఆమెను మాట్రిమోనీ సైట్లో చూసి నచ్చిందంటూ రిక్వెస్టు పెట్టాడు. తర్వాత రెండు నెలల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకుని, రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత పుణె వెళ్లిపోయారు. 2014లో గుర్గావ్కు మారారు.
కొన్నాళ్ల తర్వాత ఫేస్బుక్లో మొగుడుగారి పేజీ చూసేసరికి అతడు దొంగమొగుడని తేలింది. అతడి స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పదంగా పోస్టింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. దాంతో వెంటనే తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేసింది. వెంటనే దొంగమొగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.