టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెయిల్స్‌ | Gurgaon Student 13 Threatens To Rape Teacher | Sakshi
Sakshi News home page

టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెయిల్స్‌

Published Wed, Feb 21 2018 7:54 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Gurgaon Student 13 Threatens To Rape Teacher - Sakshi

గుర్గావ్‌లోని తరగతి గది (ఫైల్‌ ఫొటో)

సాక్షి, గుర్గావ్‌ : దైవంగా చూడాల్సిన గురువుపట్ల కొందరు విద్యార్థులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీస సభ్యతను మరిచిపోతున్నారు. అవారాగాళ్లుగా మారి తిక్కచేష్టలు చేస్తున్నారు. క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఓ టీచర్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా ఓ 13 ఏళ్ల విద్యార్థి బెదిరించాడు. టీచర్‌ను, ఆమె మైనర్‌ కూతురుని రేప్‌ చేస్తానంటూ సోషల్‌ మీడియా ద్వారా బెదిరించాడు. ఈ సంఘటన గుర్గావ్‌లోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే, ఆ స్కూల్లో ఇదే తొలి సంఘటన కాదు.

అంతకు వారం రోజుల ముందు కూడా కొంతమంది విద్యార్థులు తమతో రైడింగ్‌కు వస్తారా, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు వస్తారా అంటూ కూడా మెయిల్స్‌ పంపించారు. తాజాగా 13 ఏళ్ల విద్యార్థి చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూసి టీచర్‌ కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ రోజు నుంచి ఆమె స్కూల్‌కు హాజరుకావడం మానేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం ఈ అంశాలపై సీరియస్‌గా స్పందించడం మొదలుపెట్టింది. జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అలాగే, విద్యార్థి తల్లిదండ్రులకు స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపించనున్నట్లు స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement