
సాక్షి, తిరుపతి: తిరుమలలో రెండో వివాహానికి సిద్ధమైన వ్యక్తికి తన భార్య ఝలక్ ఇచ్చింది. కోర్టులో కేసు విచారణలో ఉండగా తెలంగాణకి చెందిన రాకేష్ అనే వ్యక్తి మౌన స్వామి మఠంలో వివాహానికి సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకున్న భార్య సంధ్యా ఉదయం మండపం వద్ద వివాహాన్ని అడ్డుకుంది.
వెంటనే మఠం వద్దకు పోలీసులు రావడంతో రెండవ పెళ్లి పంచాయితీ స్టేషన్‌కి చేరింది. 2016లో రాకేశ్ సంధ్యాలకు వివాహం జరగ్గా, ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. దీంతో తన భార్య కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం విచారణ జరుగుతుంది.. కానీ కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి రాకేష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment