బాంబే హై కోర్టు (ఫైల్ ఫోటో)
ముంబై : తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించే అధికారం కూతురుకి ఉందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందిన కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని జస్టిస్ ఆర్‌డి ధనూక, జస్టిస్ విజీ బిషత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం కొట్టేసింది. 66 ఏళ్ల మహిళ మరణించిన తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కోర్టుకెక్కారు. ఆ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది.
2016లో ఒక మహిళ తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. 2003లో ఆమె తల్లి మరణించాక తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. 2016లో తండ్రి మరణించాక తన సవితి తల్లి మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెకి తెలిసింది. తన తండ్రి ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోకుండా ఆమె చేసుకున్న పెళ్లి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. అయితే ఫ్యామిలీ కోర్టులో సవితి తల్లి.. వివాహం అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించినదని, దాని చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తారని వాదించారు. ఫ్యామిలీ కోర్టు సవితి తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆ కూతురు బాంబే హైకోర్టుకి వెళ్లగా అక్కడ ఆమెకి ఊరట లభించింది.
చదవండి:
భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment