Is Kannada Tv Actress Jyothi Rai To Marry Director Suku Purvaj, Latest Insta Post Goes Viral - Sakshi
Sakshi News home page

Jyothi Rai: దర్శకుడితో జ్యోతిరాయ్ రెండో పెళ్లి.. వైరలవుతున్న ఇన్‌స్టా పోస్ట్!

Published Mon, Jul 31 2023 9:41 PM | Last Updated on Tue, Aug 1 2023 12:26 PM

Kannada Tv Actress jyothi Rai - Sakshi

గుప్పెడంత మనసు సీరియల్‌ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు.  ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే  శాండల్‌వుడ్‌ భామ యువ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్విటర్‌ హ్యాండిల్‌లోనూ జ్యోతి పుర్వాజ్ అనే పేరు పెట్టుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వైరలైంది. 

(ఇది చదవండి: డైరెక్టర్‌తో బుల్లితెర నటి రిలేషన్‌?.. భర్త ఉండగానే!)

అయితే తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'మీకు తెలియకుండా.. అర్థం కాకుండా ఎవరినీ నిందించొద్దు. మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తు పెట్టుకోండి.' అంటూ సుకు పూర్వాజ్‌తో పాటు తన కుమారుడితో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే ఆమె ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వస్తున్న సమయంలో ఈ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. 

కాగా.. కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్.. మంగళూరులో చదివుకుంది. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి  కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సీరియల్స్‌తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది జ్యోతి రాయ్.

(ఇది చదవండి: నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement