Manchu Lakshmi Interesting Comments On Manoj Second Marriage - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi : మనోజ్‌ సెకండ్‌ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్‌ రియాక్షన్‌

Published Mon, Oct 10 2022 10:28 AM | Last Updated on Mon, Oct 10 2022 1:28 PM

Manchu Lakshmi Interesting Comments on Manchu Manoj Second Marriage - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లిపై కొద్ది రోజులు పుకార్లు షికారు చేస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్‌ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్‌-మౌనికరెడ్డి కలిసి  సీతాఫ‌ల‌మండిలోని వినాయ‌క మండపానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. అప్పటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది.

చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే

ఈ క్రమంలో మనోజ్‌ రెండో పెళ్లి ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమెకు మనోజ్‌ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అనంతరం ‘మనోజ్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే. ఈరోజుల్లో నిజాయితీ గల ప్రేమ పొందడం చాలా కష్టం. ఇప్పుడు మనోజ్‌ అలాంటి ప్రేమనే పొందుతున్నాడు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా ఆశీర్వాదం మనోజ్‌కు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యానించింది.

చదవండి: ఆదిపురుష్‌ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement