Manchu Lakshmi Home Grandly Decorated For Manchu Manoj Marriage, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj Marriage: పెళ్లి వేదిక రెడీ.. దారి పొడవునా వెల్‌కమ్‌ చెప్తున్న మనోజ్‌, మౌనికల ఫ్లెక్సీలు

Mar 3 2023 2:43 PM | Updated on Mar 3 2023 3:27 PM

Manchu Lakshmi Home Decorations for Manoj Wedding - Sakshi

ఫిలిం నగర్‌లో ఉన్న మంచు లక్ష్మి నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు. రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మంచు వారింట పెళ్లి పనులు షురూ అయ్యాయి. మంచు మనోజ్‌, భూమా మౌనిక మరికొద్ది గంటల్లో ఏడడుగులు వేయనున్నారు. మంచు లక్ష్మీ నివాసం ఈ శుభకార్యానికి వేదికగా మారింది. దగ్గరుండి మరీ తమ్ముడి పెళ్లి జరిపించనుంది మంచు లక్ష్మి. ఇక ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్‌ ఫంక్షన్‌ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మనోజ్‌ తాను మూడు ముళ్ల వేయబోయే మౌనిక ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ కొత్త పెళ్లికూతురు అని రాసుకురాగా అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.

మరోవైపు ఈ పెళ్లి కోసం ఫిలిం నగర్‌లో ఉన్న మంచు లక్ష్మి నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు. రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు మండపానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: మంచు మనోజ్‌ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement