
దండలు మార్చుకొంటున్న సుశీల, జయప్రకాశ్
కర్ణాటక, యశవంతపుర: అత్త లేని కోడలుత్తమురాలు అంటారు గానీ, ఆ అత్తే ఆమెకు కొండంత అండగా నిలిచారు. వైధవ్యంతో బాధపడుతున్న కోడలుకు అమ్మలా మారి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితానిచ్చింది. ఈ అభ్యుదయ సంఘటన మంగళూరు జిల్లా సుళ్య తాలుకా కళంజ గ్రామంలో జరిగింది. వివరాలు.. గోపాలకజెకి చెందిన శాంతప్పగౌడ కూతురు సుశీలాను అదే ఊరికు చెందిన కజెమూలె కుంయ్యక్క కొడుకు మాధవకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే మాధవ సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
గర్భవతైన సుశీలకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టాడు. బిడ్డను చూసుకుంటూ పతీ వియోగాన్ని భరిస్తోంది. ఆమె జీవితం అలాగే మగ్గిపోరాడని అత్త కుంయ్యక్క తలచింది. అయితే సుశీల ఇందుకు ఒప్పుకోలేదు. ఆమెకు మంచిమాటలతో నచ్చజెప్పి పెళ్లి చూపులు చూశారు. బంట్వాళ తాలూకా కన్యా గ్రామానికి చెందిన జయప్రకాశ్‌తో పెళ్లి నిశ్చయం చేశారు. వారి వివాహాన్ని కోటె దేవస్థానంలో నిరాడంబరంగా జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment