
నా కుమారుడిని హింసించి పెళ్లి చేశారు
చింతామణి :
మాజీ భర్త సమక్షంలోప్రియుడిని పెళ్లాడిన వివాహిత రచన ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. రచన, ఆమె మాజీ భర్త ఈశ్వర్‌గౌడలు కలసి తన కుమారుడు మంజునాథ్‌ను మానసికంగా, శారీరకంగా వేధించి వివాహానికి ఒప్పించారని అతని తల్లి వెంకటలక్ష్మి ఆరోపించింది. ఈమేరకు శనివారం కుమారుడుతో కలసి చింతామణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న తమ కుమారుడితో శారీరక సాన్నిహిత్యం పెంచుకున్న రచన.. మాజీ భర్త ఈశ్వర్‌గౌడ, అతడి సన్నిహితులతో కలసి మంజునాథ్‌ను వేధించి బలవంతంగా వివాహం చేశారని వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసింది. రచనతోపాటు ఆమె మాజీ భర్త ఈశ్వర్‌గౌడ, అతడి సన్నిహితులను అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్త
మాజీ భార్య పెళ్లికి అతనే పెద్ద