
Manchu Manoj Reacts On His Second Marraige Rumours: మంచు మనోజ్ త్వరలోనే రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఓ ఫారెన్ అమ్మాయితో మనోజ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లి వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. 'పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించండి. పెళ్లి ఎక్కడ..బుజ్జి పిల్లా? తెల్ల పిల్లా ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం' అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు.
దీంతో తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. కాగా 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ సుమారు నాలుగేళ్ల అనంతరం వారి వైవాహికి జీవితానికి ముగింపు పలికారు. 2019లో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం మనోజ్ సినిమాలపైనే దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆయన `అహం బ్రహ్మాస్మి` అనే చిత్రంలో నటిస్తున్నారు.
చదవండి: బిగ్‌బాస్: 'నువ్వు ఇలా చేస్తావనుకోలేదు..నాతో రిలేషన్‌లో ఉండి'..
మీ కుతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్