టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమోకానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment