Bhuma Nagi Reddy
-
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
మౌనిక రెడ్డితో రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఆదివారం హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక మండపానికి భూమా మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది.చదవండి:పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి! అంతేకాకుండా ఇద్దరూ కలిసి జంటగా పూజలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మౌనిక రెడ్డిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీరు ఏమంటారు అని మంచు మనోజ్‌ని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... అది వ్యక్తిగత విషయమని, మంచిరోజున తానే అన్ని విషయాలు తప్పకుండా చెబుతాను అంటూ మనోజ్ సమాధానమిచ్చాడు. ఇక భూమా మౌనిక రెడ్డితో పెళ్లి తర్వాత మనోజ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్ -
పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమోకానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. -
సభలో శవ రాజకీయం
⇒ అధికారపక్షం తీరుపై రాజకీయ వర్గాల విస్మయం ⇒ బాబు ప్రలోభాల వల్లే పార్టీ మారిన భూమా.. ⇒ ఆ విషయాన్ని ప్రస్తావించలేకే ప్రతిపక్షనేత గైర్హాజరు ⇒ అయినా అదేదో తప్పు అన్నట్లు అధికారపక్షం రాజకీయం ⇒ సభలో లేని వ్యక్తిపై నిందలు.. సంప్రదాయం కాదు.. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమా నాగిరెడ్డి చేసిన మంచితో పాటు చివర్లో పార్టీ మారిన విషయం రికార్డులకు ఎక్కడం భావ్యం కాదన్న సదుద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు దూరంగా ఉంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం చూసి రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్రెడ్డిని విమర్శించేం దుకు అధికారపక్షం ఈ చర్చను అవకాశంగా మార్చుకోవడం విచారకరమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సభకు వెళితే భౌతికంగా మన మధ్య లేని వ్యక్తి చరమాంకంలో చేసిన తప్పు గురించి మాట్లాడాల్సి వస్తుందన్న భావనతో ప్రతిపక్షనేత హుందాగా వ్యవహరించినా అందులో ఏదో రంధ్రాన్వేషణ చేసి విమర్శలకు దిగజారడం అధికారపక్షం కుటిల రాజకీయానికి అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అది సభ్యతేనా? సభలో లేని వ్యక్తిపై ఇంతలా దుమ్మెత్తి పోయడం, దొరికిందే అవకాశం అన్నట్లుగా ఎగబడి తిట్టించడం అసెంబ్లీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. అంతే కాదు.. సభ్యులు చేసిన విమర్శలలో కనీస సభ్యత, సంస్కారం మచ్చుకైనా ఉన్నట్లు కనిపించడం లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తీర్మానంపై చర్చ వదిలేసి ప్రతిపక్షపై విమర్శలకు దిగజారడం శవరాజకీయం తప్ప మరొకటి కాదని విశ్లేషకులంటున్నారు. ఇంత నీచమైన దిగజారుడు రాజకీయం మున్నెన్నడూ ఎరగమని వారంటున్నారు. ప్రతిపక్షనేతపై అధికారపక్షం ఎంతలా కక్షగట్టిందంటే... సంతాపం తెలియజేయాల్సిన భూమా కన్నా జగన్నామస్మరణే ఎక్కువసార్లు చేశారట.. కేసులు పెట్టి హింసించినవారేగా... ఇపుడు భూమాపై ప్రశంసలు కురిపిస్తున్న అధికారపార్టీ సరిగ్గా ఏడాది క్రితం ఏం చేసింది? బతికి ఉండగా భూమా నాగిరెడ్డిని దారుణంగా టార్గెట్ చేశారు. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అది ఇప్పటికీ అలాగే ఉండడం నిజం కాదా? ఆయనపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. చివరకు జైలుకు కూడా పంపించారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చివరకు కేసులు ఎత్తేస్తాం.. మంత్రి పదవి ఇస్తాం అంటూ ప్రలోభపెట్టి ఆయన్ను వశపరచుకున్నారు. మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారని భూమాయే చెప్పుకున్నారు. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి మరీ భూమాను ప్రలోభపెట్టారు. చివరకు గవర్నర్ ఒప్పుకోవడం లేదంటూ మొండిచేయి చూపించారు. ఈ వెన్నుపోటుతోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని సన్నిహితులు, అనుయాయులు వాపోవడం వాస్తవమే కదా! సొంత మామకు చంద్రబాబు ఇలాగే వెన్నుపోటు పొడిచి గుండెపోటుకు కారణమయ్యారన్న విమర్శలు నిజంకాదా? అన్నిటికీ అఖిలే సాక్షి.. ఫిరాయింపునకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ సాగించిన నిర్బంధానికి అఖిల ప్రియ ప్రత్యక్ష సాక్షి. పగబట్టినట్లు అధికారపార్టీ ఎంతగా వేధించిందో అఖిలకు తెలియదా? తండ్రిపై పెట్టిన కేసుల గురించి ఆమెకు తెలియదా? పార్టీ మారగానే ఆ దారుణాలన్నీ మంచివైపోయాయా? పదవి ఇస్తామనగానే చంద్రబాబు సహా అందరూ పునీతులుగా కనిపిస్తున్నారా? తండ్రి ఎందుకు చనిపోయా డో ఆమెకు తెలియదా? చివరకు ఆమె కన్నతల్లి శోభానాగిరెడ్డి మరణించినపుడు ఇదే తెలుగుదేశం నాయకులు అసెంబ్లీలో సంతాపతీర్మానం పెట్టకుండా అడ్డుకున్నారన్న విషయం అఖిల మరచిపోయిందా? ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళనతర్వాతే సంతాప తీర్మానంలో శోభ పేరు చేర్చడం నిజం కాదా? కన్నతండ్రి దూరమై 24 గంటలన్నా గడవ లేదు. పుట్టెడు దుఃఖంతో ఉన్న అఖిలను అసెంబ్లీకి తీసుకొచ్చి ఆమెచేత పొగిడించుకో వడం చూసి జనం విస్తుపోతున్నారు. అలాం టి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని అసెంబ్లీకి తీసుకొచ్చి బలవంతంగా మాట్లాడించడం నీచరాజకీయానికి నిదర్శనమని విమర్శకులంటున్నారు. భూమాను గౌరవంగా చూసింది వైఎస్సార్సీపీనే.. వైఎస్సార్సీపీలో ఉండగా సీనియర్ ఎమ్మెల్యేగా, రాయలసీమలో కీలకనేతగా భూమా నాగిరెడ్డిని కార్యకర్తలు, నేతలు ఎంతగానో గౌరవించారు. పార్టీలో ఉన్నతమైన, కీలకమైన పదవులలో మాత్రమే కాదు కేబినెట్ హోదా గలిగిన పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. భూమా మరణ వార్త తెలిసిన వెంటనే అఖిలప్రియకు విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేయడం నిజం కాదా? జగన్ కుటుంబం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి వెళ్లి భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించలేదా? అయినా ప్రతిపక్షనేతపై బురదజల్లడానికి అధికారపక్షం దీన్నొక సాకుగా చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్లేషకులంటున్నారు.