టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఆదివారం హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక మండపానికి భూమా మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది.చదవండి:పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!
అంతేకాకుండా ఇద్దరూ కలిసి జంటగా పూజలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మౌనిక రెడ్డిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీరు ఏమంటారు అని మంచు మనోజ్‌ని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... అది వ్యక్తిగత విషయమని, మంచిరోజున తానే అన్ని విషయాలు తప్పకుండా చెబుతాను అంటూ మనోజ్ సమాధానమిచ్చాడు.
ఇక భూమా మౌనిక రెడ్డితో పెళ్లి తర్వాత మనోజ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment