Manchu Manoj Shares Tweet About Special News Announcing On Jan 20th, Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj: రెండు రోజుల్లో మనోజ్‌ నుంచి స్పెషల్‌ న్యూస్‌, ఆసక్తి పెంచుతున్న ట్వీట్‌!

Published Wed, Jan 18 2023 1:43 PM | Last Updated on Wed, Jan 18 2023 3:41 PM

Manchu Manoj Latest Tweet Goes Viral About Special News - Sakshi

‘జీవితంలో మరో మజిలిని చేరుకోబోతున్నా.. మీ ఆశీర్వాదం కావాలి’ అంటూ హీరో మంచు మనోజ్‌ స్పెషల్‌ ట్వీట్‌ చేశాడు. మరో రెండు రోజుల్లో ఓ ప్రత్యేక వార్తను ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. కాగా కొంతకాలంగా మనోజ్‌ రెండో పెళ్లిపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ ఆసక్తిని సంతరించుకుంది. ఇంతకి మనోజ్‌ తన ట్వీట్‌లో ఏమన్నాడంటే.. ‘నా హృదయానికి చేరువైన ఓ స్పెషల్‌ న్యూస్‌ను గత కొంతకాలంగా నాలోనే దాచుకున్నా.

చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్‌ సంఘటన!

జీవితంలోని మరో ఫేజ్‌లోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీతో స్పెషల్‌ న్యూస్‌ షేర్‌ చేసుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జనవరి 20న అదేంటో చెప్పేస్తా. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కావాలి’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక మనోజ్‌ ఫ్యాన్స్‌ అయితే జనవరి 20 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుంచి ఏలాంటి శుభవార్త రాబోతుందా? అంతా ఆలోచనలో పడ్డారు.

చదవండి: పవన్‌ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.: హీరోయిన్‌

దాంతో మనోజ్‌ ట్వీట్‌ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్‌ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్‌-మౌనికరెడ్డి కలిసి  సీతాఫ‌ల‌మండిలోని వినాయ‌క మండపానికి సందర్శించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. అప్పటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement