హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడాకుల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్‌ని మనోజ్ ఇష్టపడుతున్నట్లు వార్తలు వచ్చినా అవి అవాస్తవమేనని సన్నిహితులు తెలిపారు. మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువైన అమ్మాయితోనే మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా మే నెలలలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం.
ప్రణతిరెడ్డితో మంచు మనోజ్
కాగా 2015లో ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్..మనస్పర్థల కారణంగా విడిపోయారు. పెళ్లి అయిన తర్వాత ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం, ఇటు మనోజ్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్యా విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. పర్సనల్ లైఫ్‌లో తలెత్తిన కొన్ని సమస్యలతో దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు మనోజ్..సినిమాలకు దూరంగా గడిపాడు. అయితే సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.
చదవండి : (రెండో పెళ్లిపై మనోజ్ ఆసక్తికర కామెంట్.. )
(తాజ్‌మహల్‌లో వాలిపోయిన స్టార్ కపుల్)
Comments
Please login to add a commentAdd a comment