Manchu Manoj Satirical Words on Media Reporter - Sakshi
Sakshi News home page

నీకు, నీ భార్యకు సంబంధం ఏంటో చెప్పగలవా?: మోహన్‌బాబు

Published Thu, Apr 6 2023 7:37 PM | Last Updated on Thu, Apr 6 2023 8:05 PM

Manchu Mohan Babu, Manoj Satires on Media - Sakshi

మీ ఇంట్లో నీ భార్యకు, నీకు సంబంధం ఏంటో చెప్పగలవా? తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరంతా! ఎప్పుడో ఏది అడగాలో అది అడగాలి. సమయం, సందర్భం చూసుకోవాలి. నేను హాస్పిటల్‌ ఓపెనింగ్‌కు వచ్చాను.

ఈ మధ్య వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తయారైంది మంచు కుటుంబం. వీరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మనోజ్‌ షేర్‌ చేసిన వీడియోతో ఈ వివాదాలు నిజమేనని రుజువైంది. ఇందులో విష్ణు.. మనోజ్‌ అనుచరుడి ఇంటికి వచ్చి దాడి చేసినట్లు ఉంది. తర్వాత మోహన్‌బాబు కల్పించుకోవడంతో మనోజ్‌ వీడియో డిలీట్‌ చేశాడు. అటు విష్ణు కూడా ఇదంతా అన్నదమ్ముల మధ్య ఉండే చిన్నచిన్న తగాదాలేనని క్లారిటీ ఇచ్చాడు.

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం మనోజ్‌.. కళ్లముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడం నయం అంటూ పెద్దపెద్ద కోట్స్‌ షేర్‌ చేశాడు. దీంతో మంచు వారి ఇంట్లో కుంపటి అంటూ జోరుగా వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో ఈ పోట్లాట అంతా నిజం కాదంటూ షాకిచ్చాడు విష్ణు. హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌ పేరిట రియాలిటీ షో ఉండబోతుందని ప్రకటించాడు. అందుకు సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్‌ చేశాడు.

తాజాగా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వమంటూ మంచు మోహన్‌బాబు, మనోజ్‌ను ప్రశ్నించింది మీడియా. దీనికి మనోజ్‌ వెకిలిగా నవ్వుతూ.. దురద వస్తుంది, గోకుతారా? అంటూ దురుసగా జవాబిచ్చాడు. అటు మోహన్‌బాబు.. 'మీ ఇంట్లో నీ భార్యకు, నీకు సంబంధం ఏంటో చెప్పగలవా? తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరంతా! ఎప్పుడో ఏది అడగాలో అది అడగాలి. సమయం, సందర్భం చూసుకోవాలి. నేను హాస్పిటల్‌ ఓపెనింగ్‌కు వచ్చాను. ఇది అద్భుతంగా ఉండాలి' అంటూ సమాధానం దాటవేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement