Mohan Babu Reaction On Manchu Vishnu And Manchu Manoj Fight Video In Latest Interview - Sakshi
Sakshi News home page

Mohan Babu: విష్ణు-మనోజ్‌ మధ్య విభేదాలు? మోహన్‌ బాబు ఏమన్నారంటే..

Published Fri, Mar 31 2023 11:43 AM | Last Updated on Fri, Mar 31 2023 3:18 PM

Mohan Babu Reaction On Manchu Vishnu Manoju Video in Latest Interview - Sakshi

మంచు ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్నాయంటూ కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌-విష్ణు గొడవ పడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. అది స్వయంగా మనోజ్‌ షేర్‌ చేయడంతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో మంచు వారసుల మధ్య విభేదాలు నిజమేనని అంతా అభిప్రాయపడ్డారు. అయితే కాసేపటికే మనోజ్‌ ఈ వీడియో డిలీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోపై బిగ్‌ ట్విస్ట్‌ ఇస్తూ మంచు విష్ణు గురువారం ఓ వీడియో షేర్‌ చేశాడు.

చదవండి: హాలీం కోసం మాసబ్‌ ట్యాంక్‌కు నాగ చైతన్య.. ఫొటో వైరల్‌

మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఓ రియాలిటీ షోలో భాగంలోనిదే ఆ వీడియో అని పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు విష్ణు. దీంతో మరోసారి అంతా అయోమయంలో పడిపోయారు. ఆ వీడియో నిజమా? కాదా? అని నెటిజన్లంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారసుల గొడవపై తాజాగా మోహన్‌ బాబు స్వయంగా స్పందించారు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మోహన్‌ బాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన స్వగ్రామం మోదుగులపాళెంకు ఆయన అందిస్తున్న​ సేవల నేపథ్యంలో ఈ ఇంటర్య్వూ సాగింది. ఈ సందర్భంగా ఆయనకు విష్ణు-మనోజ్‌ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో స్పందించారు.

చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా

అన్నదమ్ముల గొడవను ఉద్దేశిస్తూ భారతం గురించి ప్రస్తావించారు. ‘అన్నదమ్ముళ్లు.. చిన్నపాటి అపార్థాలే. చిలికి చిలికి గాలివానగా మారాయి. గొడవల వల్ల ఏం వస్తుంది. చివరికి అన్ని కొల్పోయారు. నిజ జీవితంలో కూడా అంతే. ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు వచ్చినా..చివరికి ఏం రాదు. ఆనందాలు దూరమైపోతాయి. నేను ఒక్కోసారి ఏం జరిగినా ఇలా ఎందుకు జరిగిందా? అని బాధపడుతుంటాను. అలా జరిగి ఉండకపోతే బాగుండు అనుకుంటా. ఇది ఎంతకాలం అని చెప్పలేం. ఆవేశాలు, మనస్పర్థలు వస్తాయి. రావని కాదు. కానీ ఇవి ఎందుకు వస్తాయంటే మాత్రం సమాధానం చెప్పలేం’ అంటూ విష్ణు-మనోజ్‌ గొడవ గురించి ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం మోహన్‌ బాబు కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ.. యూనివర్సిటీగా మారడానికి విష్ణునే కారణం అన్నారు. తనే ఎంతో కష్టపడి విద్యానికేతన్‌ను యూనివర్శిటీగా మార్చడని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement