
మంచు వారసుల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ మారింది. అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటకీ ఈ విషయం బయటపడకుండ మంచు ఫ్యామిలీ జాగ్రత్త పడింది. కానీ, తాజాగా మా అధ్యక్షుడు, నటుడు విష్ణు తీరుతో సహనం కొల్పోయిన మనోజ్ అసలు గుట్టు రట్టు చేశాడు. విష్ణు తన అనుచరుడైన సారథిపై దాడి చేసిన వీడియో షేర్ చేసి అసలు విషయం చెప్పేశాడు. కాగా అన్నదమ్ముల వివాదంలో సారథి అనే వ్యక్తి కీలకంగా మారాడు. దీంతో ఇంతకీ ఈ సారథి ఎవరన్నది ఆసక్తిగా మారింది.
చదవండి: Manchu Vishnu Vs Manoj: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్
మనోజ్- విష్ణు వివాదంలో మొదటి నుంచి ఇతడు ముఖ్య పాత్రధారి అని తెలుస్తోంది. చెప్పాలంటే అతడి వల్లే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి విష్ణు అనుచరుడిగా ఉన్న సారథి ప్రస్తుతం మనోజ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి సారథి మోహన్ బాబు సమీప బంధువట. అదే చోరవతో కొంతకాలంగా మంచు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటు అన్ని వ్యవహరాల్లో సారథి చురుగ్గా ఉంటున్నాడని సమాచారం. మా ఎన్నికల సమయంలోనూ సారథి విష్ణుతో పాటే ఉన్నాడు. మొదటి అతడు విష్ణుతోనే ఉండేవాడట.
చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేసిన బలగం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఆ తర్వాత పలు కారణాల వల్ల విష్ణుకు దూరమైన సారథి మనోజ్‌కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో తమ అన్నదమ్ముల మధ్య సారథి మనస్పర్థలు సృష్టించాడని విష్ణు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన గురించి అనుచితంగా మాట్లాడాడనే సారథిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో అతడు స్వల్పంగా గాయపడంతో ఆస్పత్రి చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఇదే వీడియోను మనోజ్ సోషల్ మీడియా షేర్ చేశాడు. దీంతో తండ్రి మోహన్ బాబు కల్పించుకోని కొడుకులపై సీరియస్ అయ్యాడు. ఆయన చెప్పడంతోనే మనోజ్ విష్ణు వీడియో డిలిట్ చేసినట్లు సమాచారం.