
తల్లి రెండో వివాహానికి మాంగల్యం అందిస్తున్న కుమారుడు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): భర్త నుంచి విడాకులు పొందిన ఓ అధ్యాపకురాలికి.. ఆమె కుమారుడు దగ్గరుండి రెండో వివాహం చేయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన చిత్రకారుడు ఆదిష్ (30) సినిమా రంగంలో పని చేస్తున్నాడు. తెన్‌కాశికి చెందిన సుభాషిణి (28) అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.
ఈమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ (09) అనే కుమారుడు ఉన్నాడు. ఈక్రమంలో ఆదిష్, సుభాషిణిని ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు సమ్మతించ లేదు. అయితే కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ.. తన చేతులు మీదుగా మాంగళ్యం అందించి ఆదిష్, సుభాషిణి పెళ్లి జరిపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment