చిక్కబళ్లాపురం: భార్య నిక్షేపంగా ఉండగానే భర్త రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా భార్య వచ్చి గలాటా చేయడంతో అందరూ అవాక్కయ్యారు. మామూలుగా ఇటువంటి సీన్లు సినిమాలలో సీరియళ్లలో కనిపిస్తాయి. కానీ ఈ సంఘటన నిజంగా బుధవారం చిక్కబళ్లాపురంలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగింది. వివరాలు.. 2018లో నోహన్‌కాంత్‌కు రశ్మి అనే యువతితో పెళ్లయింది. వారికి ఒక పాప జన్మించింది. గొడవలు రావడంతో దంపతులు విడివిడిగా ఉంటున్నారు.
ఇంతలో నోహన్‌కాంత్ గ్లోరి అనే యువతితో రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా రశ్మి వచ్చి అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య పోట్లాట జరిగింది. నాకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి ఎలా చేసుకొంటావ్, నా కూతురికి, నాకు న్యాయం కావాలని రశ్మి పట్టుబట్టింది. నోహన్‌కాంత్ మాట్లాడుతూ తమకు 2022 లో విడాకులు వచ్చాయని, చట్ట ప్రకారం రెండవ పెళ్లి చేసుకొంటున్నాను అని చెప్పాడు. చివరకు గొడవ పోలీసు స్టేషన్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment