
ప్రియాంక (ఫైల్ ఫోటో)
తాండూరు రూరల్: పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెంగోల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గౌతాపూర్‌కు చెందిన ప్రియాంక (19)కు ఆరు నెలల క్రితం మండలంలోని చెంగోల్ గ్రామానికి చెందిన బుడుగజంగం రంగప్పతో వివాహమైంది. అయితే రంగప్పకు ఇదివరకే పెళ్లి జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చామని చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకున్నారు.
మొదటి భార్యకు సంబంధించి విడాకులు ఇవ్వలేదని రెండో భార్య ప్రియాంకకు తెలిసింది. ఈ విషయమై దంపతులు తరుచూ గొడవ పడుతుండేవారు. బుధవారం మరోసారి గొడవ జరగడంతో ప్రియాంక రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు ప్రియంక భర్త రంగప్ప, మామ ఆశప్పపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment