
సాక్షి, హైదరాబాద్ : భర్త రెండోపెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఓ మహిళ అతని ఇంటిముందు ధర్నాకు దిగారు. ఫాతిమా నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్లక్రితం విశాఖపట్నంలో దేవిక, ఆరిఫ్‌కు వివాహం అయింది. వారికి మూడేళ్ల కుమారుడు. ఏడాది క్రితం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నివాసముంటున్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దేవిక పుట్టింటికి వెళ్లిపోయారు. ఆమె పుట్టింటి వద్దనే ఉండటంతో ఆరిఫ్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో దేవిక అతని ఇంటిముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment