ప్రతీకాత్మక చిత్రం
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ నివాసి సుధాకర్‌కు విడపనకల్లు మండలం మల్లాపురానికి చెందిన శ్రీలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది.
కొన్ని రోజులుగా శ్రీలేఖకు దూరంగా వచ్చిన సుధాకర్.. గురువారం ఉదయం కుటుంసభ్యులతో కలసి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన యువతిని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న శ్రీలేఖ వెంటనే బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ అనంతరం సుధాకర్‌తో పాటు అతణ్ని రెండో వివాహానికి ప్రేరేపించిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment