మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక గల బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.
ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవారు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది.
ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు. ఆమెకు వివాహం జరిగిపించాక వారి ఇంటితో తిష్టవేసి, ఆ ఇంటిలోని నగదు, నగలను తస్కరించేవాడు. ఇందుకు ఆమె సహకారం అందించేంది. లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి, భర్త దగ్గరకు వచ్చేసేది. ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది.
ఖార్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె.. భర్తతో కలిసి దొంగ పెళ్లికూతురి నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఆ మహిళ అల్లుడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment