Times
-
భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక గల బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవారు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది.ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు. ఆమెకు వివాహం జరిగిపించాక వారి ఇంటితో తిష్టవేసి, ఆ ఇంటిలోని నగదు, నగలను తస్కరించేవాడు. ఇందుకు ఆమె సహకారం అందించేంది. లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి, భర్త దగ్గరకు వచ్చేసేది. ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది.ఖార్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె.. భర్తతో కలిసి దొంగ పెళ్లికూతురి నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఆ మహిళ అల్లుడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్‌లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్‌లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
‘టైమ్స్’అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గౌతమ్ అదానీ!..కరుణా నంది ఎవరు?
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నంది చోటు దక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే తదితరులకు స్థానం లభించింది. ప్రజలకు పెద్దగా కనిపించకుండా, నిశ్శబ్దంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారని గౌతమ్ అదానీపై టైమ్స్ పత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. మహిళా హక్కుల ఛాంపియన్ అడ్వొకేట్ కరుణా నంది అని కొనియాడింది. -
నిశ్శబ్దానికి కాలం చెల్లింది
‘మీటూ’ లాంటిదే ‘టైమ్స్‌అప్’ ఉద్యమం. ఇప్పుడది బ్రిటన్‌కూ విస్తరించింది. బ్రిటన్ నటి ఎమ్మా వాట్సన్ ఆ ఉద్యమానికి పది లక్షల పౌండ్లు (సుమారు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు) విరాళం ఇచ్చారు! మీటూ ఉద్యమకారులు తమ గళాన్ని వినిపించడానికి గత జనవరిలో యు.ఎస్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్ని వేదికగా చేసుకున్నట్లే.. ఈ ఆదివారం లండన్‌లో జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్తా) ఉత్సవాలను ‘టైమ్స్‌అప్’ ఉద్యమకారులు తగిన సందర్భంగా తీసుకుని ప్రపంచ మహిళలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది. డియర్ సిస్టర్స్ ‘టైమ్స్‌అప్’ ఉద్యమం మొదలై నెల మీద కొద్ది రోజులే అయింది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన అప్పటి బహిరంగ లేఖను మీరు చదివే ఉంటారు. అవార్డు వేడుకలలో రెడ్ కార్పెట్ మీద మహిళలు నిరసనగా నలుపురంగు దుస్తులు ధరించి నడవడమూ గమనించే ఉంటారు. వేధింపులకు గురైన మహిళలు ముందుకొచ్చి చెప్పుకున్న అనుభవాలనూ వినే ఉంటారు. బహుశా అలాంటి అనుభవాలూ మీకూ ఉండివుండొచ్చు. ప్రపంచమంతటా మహిళలు ఏకమౌతున్నారు. ప్రతిఘటిస్తున్నారు. బయటికివచ్చి మాట్లాడుతున్నారు. లాటిన్ అమెరికాలో ‘నినూకమాస్’, కరీబియ లో ‘లైఫ్ ఇన్ లెగ్గింగ్స్’, ఫ్రాన్స్‌లో ‘బ్యాలెన్స్ టాన్ పార్క్’, యు.కె.లో ‘ఎవ్రీడే సెక్సిజం’.. ఉద్యమాలు, ఉద్యమ హ్యాష్‌టాగ్‌లు మొదలయ్యాయి! ‘మీటూ’ను మీరు చూసే ఉంటారు. ‘మీటూ’ అని కూడా అని ఉంటారు.గత శరదృతువులో.. హాలీవుడ్ పరిశ్రమలోని లైంగిక వేధింపులు, లైంగిక వివక్ష, లైంగిక హింసలపై పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినప్పుడు ఏడు లక్షల మంది మహిళా రైతు కూలీలు సంఘీభావంగా మాకు రాశారు.. ‘మీకు మేమున్నాం’అని! మా ఆవేదనను, ప్రపంచాన్ని మార్చవచ్చన్న మా నమ్మకాన్ని అర్థం చేసుకుని మాతో భుజం భుజం కలిపి నడిచేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్న భావన ఆ ఉత్తరాలలో కనిపించింది. సకల రంగాలలోని మహిళా బాధితులు, మహిళా కార్యకర్తల వల్ల ‘టైమ్స్‌అప్’ ఉద్యమం ఊపిరిదాల్చింది. ఇది మన ఒక్కరి పరిశ్రమలోనే మార్పు తేచ్చేంత చిన్నది కాదు. ఇంకా పెద్దది. అన్ని రంగాలలోని వేధింపుల బాధితులు చేరుకుంటున్న కూడలి ఈ ‘టైమ్స్‌అప్’. ఇక్కడ ఇంగ్లండ్‌లో ఈ ఉద్యమం కీలకమైన తరుణంలో ఉంది. ఉద్యోగినుల వేతనాలలో వ్యత్యాసం ఆరేళ్ల క్రితంనాటితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. యు.కె.లో ఉద్యోగం చేస్తున్న మహిళల్లో సగం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగ భద్రతలేని తాత్కాలిక విధుల్లోని మహిళలు అన్ని రకాల లైంగిక దోపిడీలకూ అనువైన çపరిసరాల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ సమాజాన్ని స్థాపించడానికి మన బాధ్యత ఏమిటి? పెద్ద బాధ్యతే. ఉద్యమ బాధ్యత. వెలుగులో ఉన్నా, ఆ వెలుగుల నీడల్లో ఉన్నా, మనం అంతా కూడా కార్మికులం. మనది ఒకటే స్వరం. మనం కలిసి, మిగతావాళ్లను కలుపుకుందాం. మొన్నటి వరకు మనం ఉన్న ప్రపంచంలో లైంగిక వేధింపు అన్నది తేలికపాటి విషయం. ఇప్పుడీ 2018లో అలాక్కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏకాకితనం సమూహం అవుతుంది. నిశ్శబ్దం స్వరం అవుతుంది. లోలోపల మనల్ని సమాధానపరచుకోవడం.. పైపైకి పెల్లుబికే ప్రశ్న అవుతుంది. ఇది మీ ఉద్యమం కూడా. లైంగిక వేధింపులకు, లైంగిక అకృత్యాలకు కాలం చెల్లింది. -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్ ర్యాంకులివే.. -
మహిళలకు ఉత్తమమైన యూకే టాప్ కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ఐటీ కంపెనీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అరుదైన గౌరవం లభించింది. టైమ్స్ ప్రచురించిన యూకే టాప్-50 మహిళలకు ఉత్తమమైన కంపెనీల జాబితాలో టీసీఎస్ స్థానం పొందింది. టాప్-50లో స్థానం పొందడమనే అంశాన్ని తాము లింగ సమాన త్వం కొనసాగింపునకు గుర్తుగా భావిస్తున్నామని టీసీఎస్ తెలిపింది. కాగా కంపెనీ అన్ని స్థాయిల్లోని మహిళలు వారి వారిని మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా రైజింగ్ స్టార్స్, వన్ టు వన్ కోచింగ్, వర్క్‌షాపులు వంటి తదితర కార్యక్రమాలను టీసీఎస్ నిర్వహిస్తోంది. టీసీఎస్‌లో దాదాపు లక్ష మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు.