మహిళలకు ఉత్తమమైన యూకే టాప్ కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ఐటీ కంపెనీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అరుదైన గౌరవం లభించింది. టైమ్స్ ప్రచురించిన యూకే టాప్-50 మహిళలకు ఉత్తమమైన కంపెనీల జాబితాలో టీసీఎస్ స్థానం పొందింది. టాప్-50లో స్థానం పొందడమనే అంశాన్ని తాము లింగ సమాన త్వం కొనసాగింపునకు గుర్తుగా భావిస్తున్నామని టీసీఎస్ తెలిపింది. కాగా కంపెనీ అన్ని స్థాయిల్లోని మహిళలు వారి వారిని మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా రైజింగ్ స్టార్స్, వన్ టు వన్ కోచింగ్, వర్క్‌షాపులు వంటి తదితర కార్యక్రమాలను టీసీఎస్ నిర్వహిస్తోంది. టీసీఎస్‌లో దాదాపు లక్ష మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు.