
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నంది చోటు దక్కించుకున్నారు.
2022 సంవత్సరానికి గాను ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే తదితరులకు స్థానం లభించింది.
ప్రజలకు పెద్దగా కనిపించకుండా, నిశ్శబ్దంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారని గౌతమ్ అదానీపై టైమ్స్ పత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. మహిళా హక్కుల ఛాంపియన్ అడ్వొకేట్ కరుణా నంది అని కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment