రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా! | Prabhudeva To All Set For Second Marriage | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా

Published Fri, Nov 13 2020 12:32 PM | Last Updated on Fri, Nov 13 2020 2:46 PM

Prabhudeva To All Set For Second Marriage - Sakshi

ద‌ర్శ‌కుడు, కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌, హీరో... ఇలా అన్ని రంగాల్లోనూ సక్సెస్‌ఫుల్‌ జర్నీలో కొనసాగుతున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ప్రభుదేవా రాదే సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్‌ పండగకు థియేటర్స్‌లనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు. కెరీర్‌లో ఎలాంటి ఢోకా లేకుండా వెళుతున్న ప్రభుదేవాకు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదరయ్యాయి. ప్రేమ, పెళ్లి ఇలా రెండింటిలోనూ విఫలమయ్యారు. మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్న ఈ నటుడు 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: ఈ నెల‌ 21న కలుద్దామంటున్న నాని!

ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన చుట్టాలమ్మాయితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది. ఇక నయనతార కూడా ముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఈ భామ ప్రస్తుతం డెర్టెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చదవండి: రాదే ఓటీటీలోకి రాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement