
ఆత్మహత్యకు పాల్పడిన మాల నరసింహులు
కర్నూలు, ఎమ్మిగనూరురూరల్: కుమారుడు చేసిన తప్పు వల్ల అవమాన భారంతో కుంగిపోయిన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని దైవందిన్నె గ్రామానికి చెందిన మాల నరసింహులు(48), లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్న కుమారుడు వెంకటేష్ ఏడాది కిత్రం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ అదే గ్రామానికి చెందిన మరో యువతిని ప్రేమించి నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు తీసుకెళ్లాడు.
అమ్మాయి కుటుంబ సభ్యులు వారిని గ్రామానికి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో శనివారం పంచాయితీ పెట్టారు. పెద్దలు ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడు కోవాలని సూచించారు. కుమారుడు తన పరువు తీశాడని నరసింహులు అవమాన భారంతో కుంగిపోయాడు. ఆదివారం గ్రామం నుంచి ఎమ్మిగనూరుకు చేరుకుని ఎద్దుల మార్కెట్ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరు గమనించి పట్ణణ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment