
ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ ఇటీవలె అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పెళ్లి చేసుకునేందుకు ఇమ్మాన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. చెన్నైకి చెందిని ఉమ అనే మహిళను వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
ఈ పెళ్లికి దగ్గరి బంధవులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరు కానున్నారట. మే నెలలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాతో ఇమ్మాన్ వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. కానీ విబేధాల కారణంగా గతేడాది విడిపోయారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment