D Imman
-
శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్. గతంలో శివకార్తికేయన్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడీ హీరో. అయితే వీరి మధ్య ఏమైందో ఏమో కానీ సడన్‌గా అతడి సినిమాలకు పని చేసేదే లేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'శివకార్తికేయన్‌తో ఈ జన్మలో కలిసి పని చేయను. వ్యక్తిగత కారణాల వల్ల అతడితో మళ్లీ కలిసి పని చేయలేను. ఎందుకంటే అతడు నాకు నమ్మకద్రోహం చేశాడు. తర్వాతి జన్మలో నేను మళ్లీ సంగీత దర్శకుడిగా, అతడు నటుడిగా పుడితే అప్పుడు కలిసి పనిచేస్తామేమో! ఈ జన్మకు మాత్రం అది జరగదు. అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఆ విషయం గురించి అతడిని నిలదీశాను కూడా! కానీ తనేమన్నాడనేది నేను చెప్పలేను. నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతడి గురించి ఏదీ చెప్పలేకపోతున్నాను. జనాలేమనుకుంటారన్న భయం నాకు లేదు. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు. ఇతడి వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తున్నాయి. కాగా డి. ఇమ్మాన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. విశ్వాసం సినిమాకుగానూ ఆయన ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు. తమిళన్, మైనా, కుంకీ.. ఇలా అనేక సినిమాలకు పని చేశాడు. శివకార్తికేయన్‌తో చివరగా 'నమ్మ వీటు పిల్లై' సినిమాకు పని చేశాడు. చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్
Music Director D Imman Gets Married Again: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో డి. ఇమాన్ ఒకరు. శతాధిక చిత్రాలకు సంగీతం అందిచారు ఇమాన్. తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2008లో కంప్యూటర్ ఇంజినీర్ మోనికా రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా గతేడాది డిసెంబర్ 29న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్లి చేసుకుంటానని అప్పట్లోనే తెలిపారు ఇమాన్. ఇప్పుడు దానిని నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నారు. దివంగత కళా దర్శకుడు ఉబాల్ట్ కుమార్తె అమేలీని రెండో పెళ్లి చేసుకున్నారు ఇమాన్. వీరి వివాహం ఆదివారం ఉదయం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇమాన్ మ్యారేజ్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రజనీకాంత్ 'పెద్దన్న', అజిత్ 'విశ్వాసం', సూర్య 'ఎవరికీ తలవంచకు' సినిమాలకు డి. ఇమాన్ సంగీతం అందించారు. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ ఇటీవలె అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పెళ్లి చేసుకునేందుకు ఇమ్మాన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. చెన్నైకి చెందిని ఉమ అనే మహిళను వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ పెళ్లికి దగ్గరి బంధవులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరు కానున్నారట. మే నెలలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాతో ఇమ్మాన్ వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. కానీ విబేధాల కారణంగా గతేడాది విడిపోయారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. -
షాకింగ్.. విడాకులు ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు ప్రకటించింది. ఇప్పటికే సమంత-నాగచైతన్యల విడాకుల తీసుకున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోలివుడ్ స్టార్ మూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ జంట 2020లోనే విడాకులు తీసుకుంది. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తర్వాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇమ్మాన్. ‘నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు ఇమ్మాన్. ఇమ్మాన్.. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్ జంటగా నటించిన తమిజన్ చిత్రంతో మ్యూజిగ్ డైరెక్టర్‌గా మారాడు. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) సినిమాకు సంగీతం అందించాడు. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం(2019)చిత్రానికి గాను.. జాతీయ అవార్డును అందుకున్నాడు. View this post on Instagram A post shared by D.Imman (@immancomposer)