
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్. గతంలో శివకార్తికేయన్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడీ హీరో. అయితే వీరి మధ్య ఏమైందో ఏమో కానీ సడన్‌గా అతడి సినిమాలకు పని చేసేదే లేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'శివకార్తికేయన్‌తో ఈ జన్మలో కలిసి పని చేయను. వ్యక్తిగత కారణాల వల్ల అతడితో మళ్లీ కలిసి పని చేయలేను.
ఎందుకంటే అతడు నాకు నమ్మకద్రోహం చేశాడు. తర్వాతి జన్మలో నేను మళ్లీ సంగీత దర్శకుడిగా, అతడు నటుడిగా పుడితే అప్పుడు కలిసి పనిచేస్తామేమో! ఈ జన్మకు మాత్రం అది జరగదు. అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఆ విషయం గురించి అతడిని నిలదీశాను కూడా! కానీ తనేమన్నాడనేది నేను చెప్పలేను. నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతడి గురించి ఏదీ చెప్పలేకపోతున్నాను. జనాలేమనుకుంటారన్న భయం నాకు లేదు. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు. ఇతడి వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తున్నాయి.
కాగా డి. ఇమ్మాన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. విశ్వాసం సినిమాకుగానూ ఆయన ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు. తమిళన్, మైనా, కుంకీ.. ఇలా అనేక సినిమాలకు పని చేశాడు. శివకార్తికేయన్‌తో చివరగా 'నమ్మ వీటు పిల్లై' సినిమాకు పని చేశాడు.
చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో..
Comments
Please login to add a commentAdd a comment