Music Director D Imman Announces Divorce With Wife Monicka Richard - Sakshi
Sakshi News home page

D Imman Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Published Wed, Dec 29 2021 12:55 PM | Last Updated on Wed, Dec 29 2021 1:15 PM

Music Director D Imman Announces Divorce With Wife Monicka Richard - Sakshi

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు ప్రకటించింది. ఇప్పటికే సమంత-నాగచైతన్యల విడాకుల తీసుకున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోలివుడ్‌ స్టార్‌ మూజిక్‌ డైరెక్టర్‌ డి.ఇమ్మాన్‌ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్‌ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ జంట 2020లోనే విడాకులు తీసుకుంది. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తర్వాత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు ఇమ్మాన్‌.
Music Director D Imman Divorce News

‘నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌. 
D Imman With Wife Monicka Richard And Kids

ఇమ్మాన్.. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్‌ జంటగా నటించిన తమిజన్‌ చిత్రంతో మ్యూజిగ్‌ డైరెక్టర్‌గా మారాడు. ఇటీవల రజనీకాంత్‌ హీరోగా నటించిన అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) సినిమాకు సంగీతం అందించాడు. అజిత్‌ హీరోగా నటించిన విశ్వాసం(2019)చిత్రానికి గాను.. జాతీయ అవార్డును అందుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement