ప్రముఖ సంగీత దర్శకుడు అనుమప్ రాయ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య ప్రియా చక్రవర్తి నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ‘పీకు’ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీతో అనుపమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే తన భార్య ప్రియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఆయన ఓ సందేశం ఇచ్చాడు.
‘మేము, అనుపమ్, ప్రియా చక్రవర్తి విడాకులు తీసుకోబోతున్నాం. మా ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి మంచి స్నేహితులుగా ఎవరి దారి వారు చూసుకుందామని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మేమీమద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో అందమైన, అద్భుతమైన అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు నిండి ఉన్నాయి. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా మేము భార్యభర్తలుగా విడిపోవడమే మంచిదని భావిస్తున్నాం. విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటాం.
ప్రతి విషయంలో ఇప్పటి వరకు మాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఈ మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా గోప్యతను కాపాడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అనుపమ్ రాయ్, ప్రియా చక్రవర్తిలు 2015లో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లికి ముందు వారు కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్నారు. అనుపమ్ సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా నాలుగు సోలో ఆల్బమ్‌లను కూడా విడుదల చేశాడు.
— Anupam Roy (@aroyfloyd) November 11, 2021
Comments
Please login to add a commentAdd a comment