
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పెనుగంచిప్రోలు(కృష్ణా): మొదటి భార్యకు తెలియకుండా మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుంటున్న యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్య కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.సరితను భువనగిరికి చెందిన చెర్కుపల్లి మధుబాబు 2016లో వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు, ఆడపడచు వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో మధుబాబు మరొక యువతిని రెండో వివాహం చేసుకుంటున్నాడని సరితకు తెలిసింది. ఆమె ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు స్పందించి మధుబాబు వివాహాన్ని అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: 15 ఏళ్ల క్రితం వివాహం. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని
Comments
Please login to add a commentAdd a comment